లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ బీఆర్ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌...

లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ బీఆర్ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌...

ముద్ర,తెలంగాణ:- లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ బీఆర్ఎస్‌ పార్టీకి బిగ్‌షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి శుభాష్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, మాజీ కార్పొరేటర్ భేతి స్వప్న, అనుచరులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం భేతి శుభాష్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి,  ఈటల రాజేందర్ సమక్షంలో శుభాష్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు.