కేసీఆర్‌ దారిలో ఈటెల

కేసీఆర్‌ దారిలో ఈటెల

 కేసీఆర్‌ ని దారిలోకి తెస్తా అన్న ఈటెల.. కేసీఆర్‌ దారిలోనే వెళ్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్‌ లో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ చేస్తున్న రాజకీయ విషప్రచారంలో ఈటెల కూడా పాత్ర ధారి అన్నారు. ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టె సంస్కృతి ఈటెలకు ఇష్టం లేదన్నారు. హుజురాబాద్‌ లో వందల కోట్లు ఈటెల ఖర్చు పెట్టారని, మునుగోడులో ఈటెల చేతుల విూద నుండే ఖర్చు పెట్టించారన్నారు. కేసీఆర్‌ ని దారిలోకి తెస్తా అన్న ఈటెల.. కేసీఆర్‌ దారిలోనే వెళ్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో డబ్బుల ఖర్చుకి ఈటెల వ్యతిరేకి అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.గవర్నర్‌.. సీఎం మధ్య విభేదాలు ఉంటే వేరే వేదిక విూద చూసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర దినోత్సవం విషయంలో గొడవ సరికాదని.. ప్రభుత్వం వెంటనే గవర్నర్‌ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రిపబ్లిక్‌ డే ని నిర్వహించాలని కోర్టు అదేశించే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఈ జాతి గొప్పదనం స్మరించుకోవాల్సిన సమయం ఇది అన్నారు రేవంత్‌ రెడ్డి. అబద్ధపు పునాదుల విూద బీజేపీ అధికారంలోకి వచ్చిందని, వాళ్ళ విధానాలు చూస్తుంటే.. రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగుతుందా అనే అనుమానం కలుగుతోందన్నారు రేవంత్‌ రెడ్డి. కాంగ్రెస్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ని పెంచింది.. బీజేపీ ప్రయివేట్‌ చేస్తున్నారని ఆరోపించారు. పబ్లిక్‌ సెక్టార్‌ లను అమ్మడానికి ఓ మంత్రినే పెట్టారు మోడీ అన్నారు. పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థలు అమ్మడంతో రిజర్వేషన్లు పోతున్నాయని తెలిపారు. దళిత.. గిరిజనులు ఆలోచన చేయాలని అన్నారు.

జర్వేషన్‌ స్ఫూర్తి దెబ్బ తీసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూల్చి రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడ్డారు.. కేసీఆర్‌? కూడా అంతే అన్నారు. ఓ పార్టీలో గెలిచి.. మరో పార్టీలోకి పోతే అత్యాచారం.. హత్య కేసులో వేసినట్టు ఉరిశిక్ష వేయాలని రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన సభ్యుడి సభ్యత్వం రద్దు చేసే చట్టాలు తేవాలన్నారు. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారితే.. అత్యాచారం కేసులో ఎలాంటి శిక్షలు వేస్తారో అలాంటి శిక్షలు వేయాలన్నారు. పార్టీ ఫిరాయింపులు దేశానికి ప్రమాదంగా మారిందని మండిపడ్డారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేసి.. చర్యలు తీసుకోవాలని అన్నారు రేవంత్‌ రెడ్డి. పార్టీ ఫిరాయింపులు చేసే వారికి ఉరి శిక్ష వేసేలా రాజ్యాంగ సవరణ తేవాలని డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి 6 నుండి ప్రతీ గడప వెళతామన్నారు. ఫిబ్రవరి 6 నుండి ప్రతీ గడప వెళతామన్నారు రేవంత్‌ రెడ్డి. రాహుల్‌ గాంధీ స్ఫూర్తి తో హాత్‌ సే హాత్‌ జొడో యాత్ర ప్రారంభం కానుందని..నిరంతరం పాదయాత్ర లో పాల్గొంటామన్నారు. పార్టీ ఆదేశించినట్టు పాదయాత్ర కొనసాగుతుందని రేవంత్‌ రెడ్డి తెలిపారు.