బైక్, గ్యాస్ సిలిండర్ల దొంగ అరెస్ట్

బైక్, గ్యాస్ సిలిండర్ల దొంగ అరెస్ట్

ముద్ర ప్రతినిధి, మెదక్: బైక్, గ్యాస్ సిలిండర్ల దొంగను మెదక్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్ కు పంపారు. మెదక్ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తన సిబ్బందితో బోధన్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక గుర్తుతెలియని వ్యక్తి ఒక బైకుపై ఒక సిలిండర్ తీసుకొని వెళ్తుండగా పోలీసులు ఆపి విచారించారు. వెహికల్ కు సంబంధించి పత్రాలు సరిగ్గా లేకపోవడం, సిలిండర్ కి సంబంధించి ఎలాంటి వివరాలు తెలపకపోవడంతో అతన్ని  విచారించారు.

చంద్ర భవన్ వెంచర్ లో అతను దొంగతనం చేసిన సిలిండర్ వివరాలు, దుర్గ కాలనీలో చేసిన బైకు దొంగతనం వివరాలు తెలిపాడు. అతడు పాత నేరస్తుడు  సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన మామిడి శ్రీకాంత్ గా గుర్తించారు. గత సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలలో అతడు చేసిన దొంగతనాలతో పాటు  రామాయంపేట, చేగుంట, తూప్రాన్లో అతను చేసిన బైకు దొంగతనాలు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి నాలుగు బైకులు,  26 డొమెస్టిక్ సిలిండర్లు పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని జుడిషియల్ రిమాండ్ కు పంపినట్లు ఇన్స్పెక్టర్ వెంకటేష్ వివరించారు. ఈ సందర్బంగా ఎస్ఐ పోచయ్య, పీసీలు దుర్గా రెడ్డి, రాము,గంగ రాజు,అజయ్ లను అభినందించారు.