అమరుల త్యాగాలను గుర్తించడం అభినందనీయం: బొమ్మ లక్ష్మీనారాయణ

అమరుల త్యాగాలను గుర్తించడం అభినందనీయం: బొమ్మ లక్ష్మీనారాయణ
  • తెలంగాణ సాయుధ పోరాటం సంఘం అధ్యక్షులు

నార్కట్ పల్లి డిసెంబర్ 8 :1969 తెలంగాణ సాయుధ పోరాట అమరుల త్యాగాలను కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించడం అభినందనీయమని తెలంగాణ సాయుధ పోరాట సంఘం అధ్యక్షులు సిపిఐఎం సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యులు బొమ్మ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.  

శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపేందుకు సూర్యాపేట నుంచి హైదరాబాదుకు వెళ్తూ నార్కట్ పల్లి దుర్గా హోటల్ లో ఆగి 1969 సాయుధ తెలంగాణ పోరాటం దళా అధ్యక్షునిగా పనిచేసిన దేవరశెట్టి మధుసూదన్ , శారదాంబ దంపతుల చిత్రపటాలకు. నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో గత ప్రభుత్వాలు అమరుల కుటుంబాలను గుర్తించలేదని ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరుల త్యాగాలను గుర్తించి నెలకి 25వేల రూపాయల పెన్షన్ ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము కుటుంబానికి ఆదుకోవడానికి 25 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించడం హర్షదాయకమని చెప్పారు.

ప్రమాణ స్వీకారం రోజు 250 మంది తెలంగాణ సాయుధ పోరాట యోధుల కుటుంబ సభ్యులను ఆహ్వానించడం శుభపరిణామం అని చెప్పారు. రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటగా హైదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి అనంతరం నూతన బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేయునట్లు చెప్పారు. త్వరలోనే సాయుధ తెలంగాణ పోరాట యోధుల కుటుంబ సభ్యుల చే రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అభినందన సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సాయుధ పోరాట సభ్యులు దేవత్ కిషన్ నాయక్, చేను పెద్దయ్య, కొత్త గురువయ్య, మిరియాల మధుసూదన్, నాసిని నరసింహారావు, చామల జగదీష్, బత్తుల కలమ్మ, బంధు రుద్రమ్మ, బెత్తం భద్రమ్మ , దేవర శెట్టి నారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.