లులూ పోటీల్లో ప్రథమ విజేతలు

లులూ పోటీల్లో ప్రథమ విజేతలు
  • బ్యూటీక్వీన్​గా ఇంజేటి నాగమౌనికారెడ్డి
  • మ్యాన్​ ఆఫ్​ ద ఇయర్​గా ఇబ్రహీం నిహాల్

హైదరాబాద్​: లులూ అందాల పోటీల్లో ప్రథమ విజేతగా ఇంజేటి నాగమౌనికారెడ్డి బ్యూటీక్వీన్​గా నిలవగా, పురుషుల విభాగంలో మహ్మద్​ ఇబ్రహీం నిహాల్​లు మ్యాన్​ ఆఫ్​ ద ఇయర్​ టైటిల్​లను సొంతం చేసుకున్నారు. మోడల్స్​ను ప్రోత్సహించే ఉద్దేశ్యం, తమ సంస్థలో దొరుకుతున్న ఉత్పత్తుల అమ్మకాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్​లో ఇటీవలే ఏర్పాటైన ప్రముఖ సంస్థ లులూ మాల్​ మోడల్స్​కు ఆహ్వానం పలుకుతూ అందాల పోటీలను నిర్వహించింది. గ్రాండ్​ ఫినాలే టైటిల్​ కోసం పది మంది మహిళలు, పదిమంది పురుషులు పోటీలో నిలిచారు. పోటీలో నిలిచిన మోడల్స్​ ధరించిన దుస్తులతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. రెండు రౌండ్లలో ర్యాంప్​వాక్​లో వుమెన్స్​ అండ్​ మెన్స్​ పోటీదారులు పాల్గొన్నారు. అంతిమంగా 10మంది మెడల్స్​లో ఐదుగురు ఎన్నికయ్యారు. వుమెన్స్​లో ఐదుగురు, మెన్స్​లో ఐదుగురు ఈ ఐదుగురిలో నుంచి చివరి రౌండ్​లో ప్రతిభ కనబర్చిన మహిళా మోడల్​ ఇంజేటి నాగమౌనికారెడ్డి మొదటి స్థానంలో నిలిచింది. మెన్స్​ విభాగం నుంచి మహ్మద్​ ఇబ్రహీం నిహాల్​లు మ్యాన్​ ఆఫ్​ ద ఇయర్​ (లూలూ) టైటిల్​గా నిలిచారు. శ్రీజరెడ్డి, ఆకృతిలు రన్నరప్​గా ఎంపికయ్యారు. మెన్స్​ పోటీలో నవాబ్​ షెహ్​ర్యార్​ ముస్తఫా, ఎం. శ్రీనాథ్​లు రన్నరప్​లుగా నిలిచారు. మొదటి బహుమతి విజేతలకు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల నగదు బహుమతితోపాటు సర్టిఫికెట్లు, గిఫ్ట్ హ్యాంపర్లను లులూ యాజమాన్యం అందజేసింది. 


న్యాయ నిర్ణేతలు..
లులూమాల్​ నిర్వహించిన ఈ అందాల వుమెన్స్​/మెన్స్​ పోటీలకు న్యాయనిర్ణేతలుగా రోహిత్ ఖండేల్​వాల్​ (మిస్టర్ వరల్డ్ 2016), అర్షినా సుంబుల్ (మిస్ గ్రాండ్ ఇండియా 2023) వ్యవహరించారు. ప్రాచీ నాగ్‌పాల్, మిస్ గ్రాండ్ ఇండియా 2022, ఊర్మిళ చౌహాన్, ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2023, రాజీవ్ పిళ్లై (నటుడు–సూపర్ మోడల్), షరీఫ్ నంద్యాల (ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్) అతిథుల ర్యాంప్​వాక్ ఫ్యాషన్ ప్రియుల హృదయాలను ఆకట్టుకుంది.