మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ నేతలు

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ నేతలు

ముద్ర,పానుగల్:-పానగల్ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన గాలిగల్ల పెద్ద వెంకటయ్య (48) అనారోగ్యంతో మరణించడంతో గురువారం సిపిఐ నేతలు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటయ్య మృతి దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు, మృతుని భార్యకు వితంతు పింఛను,కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు విజ్ఞప్తి చేశారు. సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఊషన్న,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్, మండల కార్యదర్శి డంగు కురుమయ్య, సీనియర్ నాయకులు మాల కుర్మయ్య, బోయ చిన్న కుర్మయ్య, చెన్నమ్మ, గౌరమ్మ, కురుమమ్మ, దండోరా మండల అధ్యక్షులు సన్నయ్య తదితరులు పాల్గొన్నారు.