డబ్బుంటే ఆధారాలు వెంట తీసుకెళ్లండి

డబ్బుంటే ఆధారాలు వెంట తీసుకెళ్లండి
  • జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచన

ముద్ర ప్రతినిధి, మెదక్:అత్యవసరంగా నగదును వెంట తీసుకెళ్తే సరైన ఆధారాలు వెంట ఉంచుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం నర్సాపూర్ నియోజకవర్గ దౌల్తాబాద్ లో ఎఫ్ఎస్టి టీంలు  చేస్తున్న తనిఖీలను, హత్నుర మండలం చందాపుర్ గ్రామంలో పోలింగ్  కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా  మాట్లాడుతూ  ఎక్కువ నగదుతో ప్రయాణం  చేయవద్దని తెలిపారు. అత్యవసరమైతే ఆధారాలు వెంట తీసుకువెళ్లాలన్నారు.  ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రం వరకు నడవలేని స్థితిలో వున్నా, 80 సంవత్సరాల పైబడిన వృద్ధులకు, వికలాంగులకు ఇంటి నుండే ఓటు హక్కు సౌకర్యము  కల్పించాలన్నారు.  జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ టీం, .డిఆర్డిఓ శ్రీనివాస్. నెం: 9281484100, జిల్లా అడిట్ అధికారి, జి . రమేష్ . నెం :9948213828, జిల్లా ట్రెజరీ అధికారి  చిన్న సాయిలు, నెం: 7799934150. ఫోన్ నంబర్లను  సంప్రదించవచ్చన్నారు.  వెంట నర్సాపూర్ ఆర్డీఓ శ్రీనివాసులు, సంబంధిత అధికారులుతదితరులు పాల్గొన్నారు