చెన్నై ఉగాది పురస్కారానికి ధర్మపురి  సాహిత్య వేత్త 

చెన్నై ఉగాది పురస్కారానికి ధర్మపురి  సాహిత్య వేత్త 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: చెన్నైకి చెందిన తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది పురస్కారాలకు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన ప్రముఖ బాలసాహిత్య వేత్త సంగనభట్ల చిన్న రామకిష్టయ్య ఎంపికయ్యారు. వచ్చే నెల 12న చెన్నలో జరిగే ఉగాది పురస్కారాలలో రామకిష్టయ్యను తెలుగు వెలుగు బిరుదుతో పురస్కారం అందచేయనున్నారు. రామకిష్టయ్య గత 23 సంవత్సరాలుగా బాల సాహిత్యం లో 700 పైన పిల్లల కథలు రచించగా, వాటిలో ఇప్పటి వరకు సుమారు 500 వరకు పిల్లల కథలు 30కి  పైన వివిధ సంచికలు, పత్రికలలో ప్రచురణ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 5వ తరగతి తెలుగు వాచకంలో ఇతర మాధ్యమాల వారికి పాఠ్యాంశంగా కనువిప్పు అనే కథ, పక్షిసాక్ష్యం, బాలల నీతి కథలు 9,10 భాగాలు, చేప నవ్వింది, రామకృష్ణ బాలల నీతి శతకం, నృహరీ శతకం లాంటి పుస్తకాలు ఆయనచే ప్రచురించబడివి.

ఇంకా మరో  3 పుస్తకాలు.  ముద్రణలో ఉన్నాయి. ఇప్పటి వరకు రామకిష్టయ్యకు  సిరిసిల్ల  రంగినేని ట్రస్ట్  బాలసాహిత్య పురస్కారం, సిద్దిపేట శ్రీ వాణి సాహిత్య పరిషత్ బాలసాహిత్య పురస్కారం, హైదరాబాద్ నవీన బాలానంద సంఘం బాలసాహిత్య పురస్కారం, , హైదరాబాద్  అంగల కుదిటి సుందరాచారి బాల సాహిత్య పురస్కారాలతో పాటు ఇంకా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు . చెన్నై ఉగాది పురస్కారాలకు బాలసాహిత్య వేత్త సంగనభట్ల చిన్న రామకిష్టయ్య పలువురు సాహితి వేత్తలు అబినంధించారు .