పెద్దపల్లి జిల్లాలో 77.96 శాతం పోలింగ్ నమోదు  కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్

పెద్దపల్లి జిల్లాలో 77.96 శాతం పోలింగ్ నమోదు  కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: నవంబర్ 30 న గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 77.96 శాతం పోలింగ్ నమోదు అయినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 2 లక్షల 54 వేల 266 మంది ఓటర్లు ఉండగా, పోలింగ్ నందు 2 లక్షల 7 వేల 397 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారని, 81.57 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ తెలిపారు.

రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న 2 లక్షల 21 వేల 19  మంది ఓటర్లు ఉండగా, పోలింగ్ నందు  లక్షా 51 వేల 865 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, 68.71 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ తెలిపారు.మంథని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న 2 లక్షల 36 వేల 442 మంది ఓటర్లు ఉండగా, పోలింగ్ నందు ఒక లక్షా  95 వేల 635 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, 82.74  శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్న 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 7 లక్షల 11 వేల 727 మంది ఓటర్లు ఉండగా, గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో 5 లక్షల 54 వేల 897 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, 77.96 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.