ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం .. ఏఐసీసీ పరిశీలకులు

ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం .. ఏఐసీసీ పరిశీలకులు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతానని ఏఐసీసీ పరిశీలకురాలు చారులత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల రాఘవపూర్ మీదికొండ, కొత్తపెళ్లి గ్రామాలలో సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో గ్రామాలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

సరైన రోడ్డు, ఇండ్లు, పాఠశాల, ప్రభుత్వ ఆసుపత్రి, డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసింది కానీ నేటి కేసీఆర్ ప్రభుత్వం 9 సంవత్సరాలు గడిచిన ఒక రైతులుకు పూర్తిగా రుణమాఫీ చేసింది లేదు కొత్తగా ఇచ్చింది లేదన్నారు. రైతులకు సబ్సిడీ కింద ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, డ్రిప్ పైపులు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీగా దక్కుతుంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డికి దక్కినదని ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత ముందుకు సాగుతుందని తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు.ఈ ఎన్నికల ప్రచారంలో మండల అధ్యక్షులు శిరీష్ రెడ్డి,వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీరాములు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.