యాదాద్రి ఆలయ అభివృద్ధికి  నిరంతరం కృషి..

యాదాద్రి ఆలయ అభివృద్ధికి  నిరంతరం కృషి..
  • కొబ్బరికాయ కొట్టే స్థలాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, ముద్ర :యాదాద్రి ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని  ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు,అధికారులు ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం అందజేశారు. కొండపైన తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న క్యూ లైన్ల సమీపంలో స్వామి వారికి మొక్కు చెల్లించుకొని కొబ్బరి కాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభిచారు. గతంలో భక్తులు మొక్కులు తీర్చుకోవటం కోసం స్వామివారిని దర్శించుకొని కొబ్బరి కాయలు కొట్టే వారు కానీ ఆలయ అభివృద్ధి పేరు మీద కొబ్బరి కాయలు కొట్టే స్థలం లేకుండా చేయడం జరిగిందని, మళ్ళీ ఈ ప్రజాపాలన లో కొబ్బరి కాయలు కొట్టేందుకు స్థలం ఏర్పాటు చేసి ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు.  భక్తులు నిద్ర చేయడం కోసం డార్మెంటరీ హల్ నిర్మాణంతో పాటు తాత్కాలిక హాల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఆలయంలో అర్చకులకు ప్రత్యేక వసతులు కల్పించి ఎక్కువ నిధులు ఇచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి అని ఆంధ్ర పేర్లు పెట్టడం  సరికాదని త్వరలో యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చబోతున్నామని అన్నారు. యాదాద్రి ఆలయ అర్చకుల కోసం రెస్ట్ రూమ్, వాష్ రూమ్ నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధాహేమేందర్, ఆలయ ఈఓ రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.