జలాల్పుర్ లో గుర్తు తెలియని మృత దేహం లభ్యం
భూదాన్ పోచంపల్లి,ముద్ర: భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జాలాల్పుర్ గ్రామ శివారులో శుక్రవారం గుర్తు తెలియని మృత దేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అటువైపు వెళ్లిన గొర్ల కాపరులకు దుర్వాసన రావడం గమనించి వెళ్లి చూడగా మృతదేహం ఉండడంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు.
దీంతో సంఘటన స్థలానికి చౌటుప్పల్ సిఐ మహేష్, స్థానిక ఎస్సై విక్రం రెడ్డి చేరుకొని మృతదేహం ఉన్న స్థలాన్ని పరిశీలించారు. మృతుడి శరీరంపై బ్లూ కలర్ జీన్స్ పాయింట్ ,బ్రౌన్ కలర్ బెల్ట్, జంజనం ఉందని తెలిపారు. మృతుడు సుమారు ఐదు నుంచి ఎనిమిది అడుగుల ఎత్తు, 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుల్లిపోవడంతో అతను మరణించి దాదాపు వారం నుంచి పది రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.