శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్

శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం గురువారం సాయంత్రం జరగనుంది. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవానికి స్వామివార్లకు ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష  పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకొని వచ్చారు. అలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం కలెక్టర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు స్వామివారి శేష వస్త్రంతో కలెక్టర్ ను సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్, ఆలయ ఇఒ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు