గృహహింస నిర్మూలనకు కృషి చేయాలి - ఎంపిపి మాడుగుల ప్రభాకర్ రెడ్డి

గృహహింస నిర్మూలనకు కృషి చేయాలి -  ఎంపిపి మాడుగుల ప్రభాకర్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి,ముద్ర;సమాజంలో మహిళలపై జరిగే గృహహింస నిర్మూలనకు కృషి చేయాలని ఎంపిపి మాడుగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని స్త్రిశక్తి భవనంలో సార్ప్ సంస్థ ఆధ్వర్యంలో గృహహింస చట్టాలపై ప్రభుత్వ అధికారులు మహిళలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో స్త్రీల పైన హింస రోజుకు పెరుగుతూనే ఉందని, ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన హింసకు గురయ్యే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదని పేర్కొన్నారు.

ఒక వ్యక్తి శారీరక, మానసిక,లైంగిక,ఆర్ధిక ఆరోగ్యానికి హాని కలిగించే లేదా గాయపరిచే ప్రమాదానికి గురి చేసే ఎలాంటి చర్య అయినా గృహహింస కిందికే వస్తుందని, ఇలాంటి హింసకు గురవుతున్న వారు ముఖ్యంగా మహిళలకు చట్టం చాలా రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. ఎవరైనా మహిళలు గృహి హింసకు గురైతే టోల్ ఫ్రీ నెంబర్ 181 లేదా సఖి సెంటర్ 9666684181 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సార్ప్ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ ప్రమీల, చౌటుప్పల్ ఏసీపి మధుసూదన్ రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, ఎస్సై భాస్కర్ రెడ్డి,సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ లావణ్య, సార్ప్ సంస్థ సిబ్బంది సరిత, స్వరూప, రాకేష్, స్వామి, శ్రీనివాసరావు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.