హైదరాబాద్ వ్యాపారులకు జీహెచ్‌ఎంసీ అలర్ట్

హైదరాబాద్ వ్యాపారులకు జీహెచ్‌ఎంసీ అలర్ట్

ముద్ర,హైదరాబాద్:- వ్యాపార, వాణిజ్య అనుమతుల పై జీహెచ్ ఎంసీ కీలక ప్రకటన చేసింది. గడువు ముగిసిన వ్యాపార, వాణిజ్య అనుమతులను వెంటనే రెన్యువల్ చేసుకోవాలని వ్యాపారులకు జీహెచ్ఎంసీ తెలిపింది. ఈ నెల జనవరి 31లోగా జరిమానా లేకుండా అనుమతులు రెన్యువల్‌ చేసుకోవాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ వెల్లడించారు. ఈ ఏడాది అనుమతుల పునరుద్ధరణతోపాటు కొత్త అనుమతులకూ దరఖాస్తు చేసుకోవచ్చని జీహెచ్ ఎంసీ సూచించింది. వచ్చే 1 నుంచి మార్చి 31 వరకు 25 శాతం, ఏప్రిల్ 1 తర్వాత 50 శాతం జరిమానా విధించనుంది. 

అయా సర్కిళ్లలోని మీ-సేవా కేంద్రాలతో పాటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గ్రేటర్‌లోని వ్యాపారులందరూ, వ్యాపార అనుమతుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయని వ్యాపారులపై షెడ్యూల్ ప్రకారం జరిమానాలు ఉంటాయని జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ వెల్లడించారు. జీహెచ్ ఎంసీ అనుమతి లేకుండా వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని   హెచ్చరించారు. అనుమతులు లేకుండా వ్యాపారలు నిర్వహిస్తున్న వ్యాపారులకు 100 శాతం, ఆపై ప్రతి నెలా 10 శాతం జరిమానా తప్పదన్నారు.