కూష్మాండ దేవి గా సరస్వతి అమ్మవారు 

కూష్మాండ దేవి గా సరస్వతి అమ్మవారు 

బాసర, ముద్ర:-నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగో రోజు బుధవారం అమ్మవారు కూష్మాండ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామునే ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, అల్లం వడలు నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.