చిన్నారెడ్డి ఎంపిక పట్ల హర్షం

చిన్నారెడ్డి ఎంపిక పట్ల హర్షం

ముద్ర,పానుగల్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘ వైస్ చైర్మన్ గా డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి నియమితులైన సందర్భంగా ఎఐసిసి జాతీయ ఓబిసి కోఆర్డినేటర్ డాక్టర్ కేతూరి వెంకటేష్ హర్షం వ్యక్తం చేశారు.చిన్నారెడ్డి ని కలిసి పూల బోకే ను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా,ఎమ్మెల్యేగా,మంత్రిగా,ఎఐసిసి కార్యదర్శిగా పని చేసిన అనుభవం,సౌమ్యుడిగా పేరు గాంచిన చిన్నారెడ్డి గారిని సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ అధిష్టానం  ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా నియమించడం హర్షించదగిని విషయం అన్నారు.చిన్నారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూర్య  సురేష్ గౌడ్ ఉన్నారు.