42 రోజుల వేట ఫలించిన వేళ!

42 రోజుల వేట ఫలించిన వేళ!
  • నిందితులను పట్టించిన టోపీ

 న్యూఢిల్లీ: బెంగుళూరులోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్ లో పేలుళ్ల నిందితుల వేట మొత్తం 42 రోజుల పాటు కొనసాగింది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), కేంద్ర నిఘా సంస్థలు, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటక, కేరళ పోలీసుల సంయుక్త సహకారంతో ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. ఇక్కడ మొదట తీసుకుంటే.. కేఫ్ లో బ్యాగ్ వదిలి వెళ్లిన నిందితుడి టోపీ పెద్ద క్లూ అయ్యింది. ఈ టోపీని వారు చెన్నైలోని ఒక స్టోర్ లో కొనుగోలు చేశారు. తర్వాత నిందితులు ఇద్దరూ ఒక ప్రత్యేక పద్ధతిలో తప్పించుకు తిరుగుతుండడాన్ని ఎన్ఐఎ పోలీసులు గుర్తించారు, ఎక్కడైతే అతిథులు ఎవరన్నది పట్టించుకోని అతిథి గృహాలు, లాడ్జిలను మాత్రమే ఎంచుకున్నారు. అక్కడే బస చేసేవారు.

     బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1వ తేదీన జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌లోని దిఘా నుంచి  శుక్రవారం అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహాలు తప్పించుకు తిరుగుతున్న పద్ధతిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 42 రోజుల పాటు ట్రాక్ చేసింది.  ఒక ప్రముఖ వార్తాసంస్థకు కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు..

ఇది నిఘా సంస్థలకు, NIAకి కీలకమైన పరిణామం. 42 రోజుల పాటు ఏజెన్సీలు ఒక ప్రత్యేక పద్ధతిలో నిందితుల కదలికలను ట్రాక్ చేశారు. ముఖ్యంగా నిందితులు ఇద్దరూ తమను ఎవరూ ప్రశ్నించని గెస్ట్‌హౌస్‌లు మరియు ప్రైవేట్ లాడ్జీలలో మాత్రమే ఉన్నారు.

 అసలు ఈ కేసులో మొట్టమొదట నిఘా సంస్థలు గుర్తించిన అంశం ఒక నిందితుడు ధరించిన టోపీ. వారిద్దరూ చెన్నైలోని ఒక లాడ్జిలో బస చేశారు. ఎప్పుడైతే బెంగుళూరు పేలుడు జరిగిందో, ఆ తర్వాత ఆ లాడ్జిని ఖాళీ చేశారు.   తర్వాత నిఘా సంస్థలు దాదాపుగా చిన్నచిన్న టూరిస్ట్ సెంటర్స్ లో కూడా ఐడెంటిటీని అడగని అతిథి గృహాలు, లాడ్జిలను విచారించారు. చివరికి వారిద్దరూ ఈస్ట్ మిడ్నాపూర్ లోని దిఘాలో పట్టుబడ్డారని. వారిని కోర్టులో హాజరుపరిచినట్టు ఆ వర్గాలు తెలిపారు.

  నిందితులు ఇద్దరూ కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తీర్థహళ్లికి చెందిన వారిగా గుర్తించారు. కేఫ్ లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ని షాజిబ్ అమర్చగా, మొత్తం దీని ప్రణాళిక, అమలు, పేలుడు ను తాహా పర్యవేక్షించాడని ఇంటిలిజెన్స్ అధికారులు తెలిపారు.

     మార్చి 1వ తేదీన ఒక మనిషి రామేశ్వరం కేఫ్ లోకి ఒక బ్యాగ్ లో పేలుడు పదార్థాలతో వచ్చాడు. ఆ బ్యాగ్ లో వున్న పేలుడు పదార్థాలు గంట వ్యవధి తర్వాత పేలేలా టైమర్ సెట్ చేశారు. ఈ పేలుడు సంఘటనలో పది మంది వ్యక్తులు గాయపడ్డారు. బెంగుళూరు బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ కేఫ్, పేలుడు సంఘటన తర్వాత మార్చి 15న కట్టుదిట్టమైన భద్రత మధ్య మళ్లీ తెరుచుకుంది.  మార్చి 3వ తేదీ నుంచి ఈ కేసును ఎన్ఐఎ దర్యాప్తు చేయడం ప్రారంభించింది. ఆ హోటల్ సీసీటీవీ ద్వారా బయటికి వచ్చిన చిత్రాన్నిబహిర్గతం చేసిన ఎన్ఐఎ, అనుమానితుణ్ని ఆచూకీ తెలిపి పట్టించిన వారికి పది లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది.