కనకమామిడి లో  గీతా జ్ఞాన యజ్ఞం

కనకమామిడి లో  గీతా జ్ఞాన యజ్ఞం

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రంగారెడ్డి జిల్లా ముద్దుబిడ్డ జస్టిస్ కొండా మాధవరెడ్డి శత జయంతి సందర్భంగా కనకమామిడిలో శనివారం నాడు గీతా జ్ఞాన యజ్ఞం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లోనూ నిర్వహిస్తున్న కార్యక్రమాల పరంపరలో భాగంగా గీతా జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కనకమామిడి లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కొందా లక్ష్మీకాంత్ రెడ్డి, కార్యదర్శులు కే బలవంత్ రెడ్డి, ఎం శ్రీనివాసరెడ్డి ఇతర కార్యవర్గ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.

 కాలినడకన తిరుమలకు... 

'గడప...గడపకు...గోవు... గోవిందుడు... గీత' అనే నినాదంతో ప్రముఖ అర్చకుడు గట్టు అరుంధతి రంగాచార్యులు తిరుమలకు కాలినడకన వెళ్తున్నారు. హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ లో ఉన్న శ్రీ విజయలక్ష్మి దేవాలయ ప్రధాన అర్చకులైన రంగాచార్యులు మరికొందరు అనుచరులతో కలిసి ఈ యాత్రను చేపట్టారు. దారిలో అనేక దేవాలయాలను వారు సందర్శిస్తారు. అందులో భాగంగా వారు శనివారం నాడు కనకమామిడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.