తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో ఇంజనీరింగ్‌లో 80 శాతం పాస్‌

తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో ఇంజనీరింగ్‌లో 80 శాతం పాస్‌

ఈ రోజు విడుదలైన తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో ఇంజనీరింగ్‌లో 80 శాతం పాస్‌ పర్సెంటెల్‌ వచ్చింది. వీరిలో అబ్బాయిలు 79 శాతం, అమ్మాయిలు 82 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రకల్చర్‌లో 86 శాతం ఉత్తీర్ణత సాధించగా వీరిలో.. అబ్బాయిలు 84 శాతం, అమ్మాయిలు 87 శాతం మంది ఉత్తీర్ణత పొందారు.

ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో టాప్‌ ర్యాంకర్లు
తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో ‘అనిరుద్‌ సనపల్ల’కు ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. సెకండ్‌ ర్యాంక్‌ యాకంటి పల్లి వెంకట మనిందర రెడ్డి, మూడో ర్యాంక్‌ చల్లా రమేష్, నాల్గవ ర్యాంక్‌ అభినిత్ మంజేటి, 5వ ర్యాంక్‌ ప్రమోద్‌ కుమార్‌ సాధించారు.

అగ్రికల్చర్‌, ఫార్మసీలో టాప్‌ ర్యాంకర్లు
అగ్రికల్చర్‌, ఫార్మసీలో బురుగుపల్లి సత్య ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. రెండో ర్యాంక్‌ నాసిక వెంకట తేజ, మూడో ర్యాంక్‌ సఫల్‌ లక్ష్మి పసుపులేటి, నాల్గవ ర్యాంక్‌ దుర్గెంపూడి కార్తికేయ రెడ్డి, 5వ ర్యాంకు బోర వరున్‌ చక్రవర్తి ర్యాంకులు సాధించారు.