అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డ ఆగంతకులు

  • సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్లో ఇద్దరు ఆగంతకులు అలజడి సృష్టించారు. 
  • బాత్రూం కిటికీ పగలకొట్టి లోపలికి చొరబడి, విద్యార్థినులపై దాడికి ప్రయత్నించారు. 
  • అమ్మాయిలు అప్రమత్తమై ఒకరిని పట్టుకొని చున్నీతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. మరొకరు పారిపోయారు. 
  • హాస్టల్లో తమకు రక్షణ కరవైందని, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని విద్యార్థినులు నిరసనకు దిగారు. 
  • సమస్య పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు.