రక్తదానం జీవన దానం

రక్తదానం జీవన దానం
  • యేడాదిలో ఒకసారైనా చేయాలి
  • గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

ముద్ర, తెలంగాణ బ్యూరో:రక్తదానం పట్ల ప్రజలలో అపోహలను తొలగించి వారికి సరైన అవగాహన కల్పించడం అత్యంత ఆవశ్యకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రక్తదానాన్ని ప్రోత్సహించడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా బుధవారం రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘రక్తదానం అంటే జీవన దానమే’ అని పేర్కొన్నారు. రక్తదానం వలన కలిగే ప్రయోజనాలను అందరికీ వివరించాలన్నారు. ప్రతి ఒక్కరు యేడాదిలో ఒక్కసారైనా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. అత్యధికసార్లు రక్తదానం చేసిన రక్త దాతలు, రక్తదాన ప్రచారకులకు ఈ సందర్భంగా గవర్నర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో  గవర్నర్ సెక్రెటరీ  కె. సురేంద్రమోహన్, రెడ్ క్రాస్ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ చైర్మన్ అజయ్ మిశ్రా, గవర్నర్ జాయింట్ సెక్రెటరీలు, సిబ్బంది పాల్గొన్నారు.