బ్రహ్మోత్సవాలకు ఎంఎల్ఏ మందుల సామెల్ కు ఆహ్వానం

బ్రహ్మోత్సవాలకు ఎంఎల్ఏ మందుల సామెల్ కు ఆహ్వానం


మోత్కూర్,ముద్ర:మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో  రేపటి నుండి ప్రారంభం కానున్న శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు తుంగతుర్తి నియోజక వర్గ ఎమ్మెల్యే మందుల సామేల్ కు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గుండగొని రామ చంద్రు గౌడ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఆహ్వానం అందజేశారు.శనివారం  హైదరాబాద్ లోని ఎంఎల్ఏ నివాసంలో కలిసి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎంఎల్ ఏ  సామేల్ ను ఘనంగా సన్మానించి బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బుర్ర యాదయ్య,ఉయ్యాల అంజయ్య, బీసు యాదగిరి, బొల్లేపల్లి సీతయ్య, పట్టూరి అంజయ్య,మెంట నాగేష్, మూల నర్సింహ, టిరాజు పాల్గొన్నారు