ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మార్కెట్ డైరెక్టర్

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మార్కెట్ డైరెక్టర్

ఆలేరు ముద్ర : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామానికి చెందిన ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మామిడాల నరసింహులు, బిఅరెస్  నాయకులు గడ్డం అంజిరెడ్డి, అమృతం నాగులు లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా వారికి ఆయన పార్టీ కండువాలు మెడలో వేసి సాదరంగా ఆహ్వానించారు, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.