వినోద్ కుమార్ కు బి ఫామ్ అందజేసిన కేసిఆర్ 

వినోద్ కుమార్ కు బి ఫామ్ అందజేసిన కేసిఆర్ 

ముద్ర ప్రతినిధి కరీంనగర్ :హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసీఆర్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ  బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి బోయినపల్లి వినోద్ కుమార్ కు   "బీ" ఫారం అందజేశారు. విజయమే లక్ష్యంగా పనిచేయాలని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బిఆర్ఎస్  నాయకులకు దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తో పాటు పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు