పొన్నం అశోక్ గౌడ్ కు కీలక బాధ్యతలు

పొన్నం అశోక్ గౌడ్ కు కీలక బాధ్యతలు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ  శాఖ మంత్రిపొన్నం ప్రభాకర్ సోదరుడు సీనియర్ న్యాయవాది, పొన్నం అశోక్ గౌడ్ ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్, హ్యూమన్ రైట్స్, మరియు ఆర్టిఐ డిపార్ట్మెంట్ చైర్మన్ గా నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అడ్వకేట్ సెక్రటరీ విపుల్ మహేశ్వరి  ఉత్తర్వులు జారీ జారీ చేశారు. నాపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పజెప్పిన ఏఐసీసీ అధినాయకత్వానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ  ఉన్నతికి శక్తివంచన లేకుండాకృషి చేస్తానని పేర్కొన్నారు. ఈరోజు వెలువడిన ఉత్తర్వుల్లో కీలకంగా వ్యవహరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ తో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అడ్వకేట్ సెక్రటరీ విపుల్ మహేశ్వరి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకటన పొన్నం అభిమానుల్లో జోష్ ను నింపింది.