బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం

బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం

 బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమని బిజెపి జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని జిల్లా బిజెపి కార్యాలయం లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో బీసీలకు సరైన ప్రాధాన్యత కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మంత్రివర్గంలో  బీసీలకు సరైన ప్రాధాన్యత కల్పించలేదన్నారు. బీసీ ఓట్ల తోని గద్దెనెక్కి ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలను పట్టించుకోవడం దారుణం అన్నారు. కెసిఆర్ ను గద్దె దింపే వరకు బీసీలు  పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మిగులు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, అదోగతి పాలు చేసిన కేసీఆర్ వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ , ఓబీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. విద్య, ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. దళిత బంధు తరహాలో బీసీ - బంధు అమలు చేయాలని ప్రభుత్వాన్ని  కోరారు.  తొలుత  ఇంటింటికి బిజెపి-   పల్లె పల్లెకు ఓ బి సి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు నాగేశ్వరరావు, యడ్లపల్లి  శ్రీనివాస్ కుమార్, రంగా కిరణ్ , నరేంద్రబాబు, కృష్ణారావు, రవీందర్, మాధవ్,  బి. రవి గౌడ్ , జల్లారపు శ్రీనివాస్ కుమార్ , చింతలచెరువు శ్రీనివాస్  ,గాంధీ , బైరి నిర్మలాదేవి, జోగు రమాదేవి, ప్రదీప్, హరిహరన్  తదితరులు పాల్గొన్నారు.