చలివేంద్రం ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.

చలివేంద్రం ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.

ముద్ర,సంస్ధాన్ నారాయణపురం:- సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉప్పల లింగస్వామి గారి స్వాజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్ర ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.అనంతరం మంచి నీటిని త్రాగి వేసవిలో చలివేంద్రం నిర్వహించడం ద్వారా వివిధ గ్రామాల నుండి మండల కేంద్రానికి వచ్చేటటువంటి ప్రయాణికులకు చలివేంద్రం ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే సామాజిక సేవా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుండాలని తెలిపారు అనంతరం నిర్వాహకులు ఉప్పల లింగస్వామిని అభినందించారు.ఈ యొక్క కార్యక్రమంలో నారాయణపురం మండల మాజీ ఎంపిపి బుజ్జీనాయక్, మండల పార్టీ అధ్యక్షులు ఏపూరి సతీష్,మండల నాయకులు ముద్దంగుల నరసింహ, గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి,మరియు కాంగ్రెస్ పార్టీ మండల,గ్రామ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.