బెల్టు షాపుల్లో యధేచ్చగా మద్యం అమ్మకాలు..

బెల్టు షాపుల్లో యధేచ్చగా మద్యం అమ్మకాలు..
  • బార్లను తలపిస్తున్న వైనం...
  • జాడ లేని ఎక్సైజ్ సిబ్బంది...

గొల్లపల్లి. ముద్ర:- పల్లెల్లో ఎక్కడ చూసినా బెల్టు షాపుల కిక్కు ఫుల్ గా కనిపిస్తోంది.ఏ గ్రామంలో చూసినా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ని అమలు అయిన తనిఖీలు చేయాల్సిన ఎక్సెజ్ అధికారులు మౌనంగా ఉంటున్నారని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.గొల్లపల్లి మండల వ్యాప్తంగా బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతున్నాయి.వయసుతో సంబంధం లేకుండా యువత మద్యానికి బానిస అవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.యువత మద్యానికి బానిసై మరణాలకు దిగుతూ నేరస్తులుగా మారి పలు కేసుల్లో చిక్కుకుంటున్నారు. అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా బెల్ట్ షాప్ లు నిర్వహిస్తున్న కన్నెత్తి ఎక్సైజ్ శాఖ అధికారులు   చూడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయిని. అబ్కారీ శాఖ అధికారులకు మద్యం దుకాణాల ద్వారా బెల్ట్ షాప్ లను తనిఖీ చేయకుండా భారీగా ముడుపులు మూడుతున్నట్లు సమాచారం. ఒక్కొక్క గ్రామంలో ఐదు ఆరు బెల్ట్ షాప్ లు నిర్వహిస్తున్నారని విషయం తెలిపిన పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.పల్లె ప్రాంతాల్లో  ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపుల నిర్వహణ చేపడుతూ ధనార్జనే  ధ్యేయంగా నిర్వాహకులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్ట్ షాపుల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుచున్నారు.