ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొండా సురేఖ

ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొండా సురేఖ

ముద్ర ప్రతినిధి, మెదక్:  ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జీ మంత్రిగా కొండా సురేఖను నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

గతంలో కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వంలో జిల్లాలకు ఇన్చార్జి మంత్రులు ఉన్న విషయం తెలిసిందే. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాల ఇన్చార్జ్ మంత్రి అంటూ ఏమి కేటాయించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తాజాగా ఉ ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించారు.