ఆగస్టు 29న చలో హైదరాబాద్ ను విజయవంతం చేయండి.....

ఆగస్టు 29న చలో హైదరాబాద్ ను విజయవంతం చేయండి.....
  • ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జనార్దన్ పిలుపు....

ఆలేరు (ముద్ర న్యూస్):కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐ ఎఫ్ టి యు జాతీయ కమిటీ పిలుపుమేరకు ఆగస్టు 29న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కార్మిక వర్గం విజయవంతం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచకొండ జనార్ధన్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సోమవారం నాడు హైదరాబాద్ లోని మార్క్స్ భవనంలో చలో హైదరాబాద్ మరియు ఇందిరా పార్కు వద్ద జరిగే మహా ధర్నాకు సంబంధించిన గోడ ప్రతులను నాయకులతో కలిసి ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కనుసైగలలో బిజెపి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను. రంగ సంస్థల ప్రైవేటుపరం చేయడాన్ని. విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్. క్యాజువల్. వర్కర్లను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ తో పాటు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐఎఫ్టియు జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 29న జరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

అన్ని రంగాల అసంఘటిత. సంఘటిత కార్మికులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. దేశ సంపదను. ప్రభుత్వ రంగ సంస్థలను సంస్థలకు అప్పగించడానికి మోడీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వ హయాంలో దేశం పురోగమన వెళ్లిందని తెలిపారు. అటవీ సంపదను కార్పొరేట్ శక్తులు కొల్లగొట్టక పోవడానికి 2006లో ఉన్న అటవీ సంరక్షణ చట్టాన్ని రద్దు చేసి 252 అటవీ సవర్ణ చట్టాన్ని ముందుకు తెచ్చారని చెప్పారు. కార్మిక వర్గ శ్రమను యదేచ్ఛగా దోచుకోవడానికి కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలలో. ప్రైవేటు సంస్థల్లో ఉన్న శాశ్వత కార్మికుల. ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్. ఔట్ సోర్సింగ్. క్యాజువల్. స్కీం వర్కర్లతో పని చేయించుకోవడానికి అనుమతులు ఇస్తూ తాత్కాలిక ఉద్యోగులపై పని భారం పెంచుతూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ రాష్ట్రంలో కాంట్రాక్ట్. ఉండారని తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పి నేడు అన్ని రంగాలలో కాంట్రాక్ట్. ఔట్సోర్సింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టి కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 29న జరిగే కార్యక్రమానికి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షురాలు అరుణ. ప్రధాన కార్యదర్శి డి మల్లన్న. జిల్లా నాయకులు దుబ్బ రంజిత్. ఎం రమేష్. డి భిక్షం. ప్రమీల. కె బిక్షపతి తో పాటు తదితరులు పాల్గొన్నారు.