రైతులను ఫోన్ లో అభినందించిన ఎమ్మెల్యే.

రైతులను ఫోన్ లో అభినందించిన ఎమ్మెల్యే.

సారంగాపూర్ ముద్ర:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఉత్తర్వులు జారీ చేయగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గం లోని రైతులకు ఫోన్ చేసి అభినందించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హైదరాబాదులోని అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమావేశాల అనంతరం  పలు గ్రామాలకు చెందిన రైతులకు ఫోన్ చేసి బారాస ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తుందని అన్నారు.

గతంలో 50 వేల రూపాయల లోపు ఉన్న రుణాలను మాఫీ చేసిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రైతు రుణాల మాఫీ పై బారస కార్యకర్తలు, రైతులు ఆయా గ్రామాల్లో వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. బీర్పూర్, సారంగాపూర్ మండల కేంద్రాల్లో ఆయా మండలాల అధ్యక్షులు నారపాక రమేష్ ,గుర్రాల రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కెడిసి సి బ్యాంక్ డైరెక్టర్ ముప్పాల రామచందర్ రావు, నాయకులు రామకృష్ణ గంగాధర్, ఘర్షకుర్తి రమేష్, అజ్మీర గోపి ,చిక్రం మారుతి, ముక్క శంకర్ తదితరులు పాల్గొన్నారు.