పోయిన సెల్ ఫోన్లు అప్పగింత

పోయిన సెల్ ఫోన్లు అప్పగింత

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తమ ఫోన్లను పోగొట్టుకున్న 15 మందికి ఎస్పీ ప్రవీణ్ కుమార్ సోమవారం వాటిని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైన తమ సెల్ఫోన్లను పోగొట్టుకుంటే చోరీ బాధితులు తక్షణమే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సిఇ ఐ ఆర్) వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తే పోయిన సెల్ఫోన్ తిరిగి పోందే అవకాశం వుందని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమములో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఐటీకోర్ ఇంచార్జ్ రవి కుమార్ పాటు ఐటీకోర్ విభాగం సిబ్బంది, సెల్ఫోన్ ల యజమానులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.