పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు

పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ రాష్ట్రావతరణ సందర్భంగా శనివారం నిర్వహించిన వేడుకల్లో పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. పురస్కారాలు పొందినవారిలో ఉత్కృష్ట సేవా పతకాన్ని శ్రీనివాస్( డీ ఏ ఆర్), గంగా సింగ్( ముదొల్), శమియుల్లా ఖాన్( నిర్మల్), అతి ఉత్కృష్ట సేవా పతకం ఉమాపతి( దిలావర్ పూర్), అబ్దుల్ జమీర్ (నిర్మల్ టౌన్), నంద కుమార్( డీ ఏ ఆర్), జెమ్ సింగ్( డీ ఏ ఆర్), శంకర్ ( భైంసా) ఉన్నారు.