మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ వద్ద  మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ బైక్ ర్యాలీ ని ప్రారంభించి,  కొత్త బస్టాండ్ పాతబస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేకత, హోదాను, గుర్తింపును తెచ్చుకుంటున్నారని అన్నారు.  కీలక పదవుల్లోనూ రాణిస్తున్నారని, రాజకీయంగానూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని అన్నారు.

మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ  నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ధీటుగా రాణిస్తున్నారన్నారు.మహిళలు ధైర్యంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. దేశ స్థితిగతులు మార్చడంలో మహిళలు ప్రముఖ ప్రాత పోషిస్తున్నారని పేర్కొన్నారు. రాణి రుద్రమాదేవి, వీరనారి ఝాన్సీలక్ష్మిభాయి వంటి మహనీయులు కనబడుతారని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరోచిత ఉద్యమాన్ని నడిపించిన మల్లు స్వరాజ్యమూ ఇప్పటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. అంతరిక్షం వరకు దూసుకుపోయి తన జీవితాన్ని జాతికి అంకితం చేసిన కల్పనాచావ్లా, అంధురాలైనప్పటికీ మహిళల అభ్యున్నతికై పోరాడిన హెలెన్కిల్లర్‌ కూడా ఒక దీర వనితేనని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటిపర్తి విజయ లక్ష్మి దేవేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పిప్పరి అనిత, మహిళలు పాల్గొన్నారు.