మహాత్ముడి మార్గం మహోన్నతమైంది!

మహాత్ముడి మార్గం మహోన్నతమైంది!
  • మనిషి ఉన్నంతకాలం గాంధీజీ పేరు ఉంటుంది
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ
  • రాజ్​ఘాట్ లో జాతిపితకు ఘన నివాళి

ఢిల్లీ: భూమిపై మానవ మనుగడ ఉన్నంత కాలం మహాత్మాగాంధీ పేరు నిలిచి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని ఘనంగా నివాళులర్పించారు. సోమవారం ఢిల్లీలోని రాజ్​ఘాట్​ను దర్శించి మహాత్ముడి సమాధిపై పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. గాంధీ చూపిన శాంతిమార్గం ఎంతో ఉన్నతమైందన్నారు. మౌనంగానే, శాంతియుతంగానే పోరాటాన్ని సాగించి భారత దేశానికి స్వాతంత్ర్యం అందించిన ఘనత మహాత్ముడిది అని పేర్కొన్నారు. అనంతరం జరిగిన సర్వమత ప్రార్థనల్లో ద్రౌపది ముర్ము, మోడీ పాల్గొన్నారు. నివాళులర్పించిన వారిలో ఉప రాష్ర్టపతి జగదదీప్​ధన్కర్, కాంగ్రెస్​అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్​సభ స్పీకర్​ఓంబిర్లా, కేంద్రమంత్రులు, జితేంద్రసింగ్, మీనాక్షి లేఖి, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా తదితరులు ఉన్నారు.