రేప్ కేసులో నిందితుడి ఇల్లు బుల్డోజర్ తో నేలమట్టం: వాహనం నడిపింది పోలీసులే.!

రేప్ కేసులో నిందితుడి ఇల్లు బుల్డోజర్ తో నేలమట్టం: వాహనం నడిపింది పోలీసులే.!

భోపాల్: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సాగుతున్న బుల్డోజర్ న్యాయ పరంపరలో మరో సంఘటన చేరింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు  250 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామోహ్ అనే గ్రామంలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కౌశల్ కిషోర్ చౌబే అనే వ్యక్తి ఇంటిని పోలీసులే స్వయంగా బుల్డోజర్ తో కూల్చివేశారు. బుల్డోజర్ తోలింది స్వయంగా పోలీసులే కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. పోలీసు అధికారులు దీన్ని ధ్రువీకరిస్తూ నిందితుడు ఆక్రమించిన స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి దాన్ని కూల్చి వేశామని చెప్పారు.