నవంబర్​ 26చీకటి రోజు

నవంబర్​ 26చీకటి రోజు

 ఉగ్రవాదాన్ని సహించబోమన్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ​: నవంబర్ 26వ తేదీనీ దేశం ఎన్నటికీ మరిచిపోలేని అది భయంకరమైన రోజని, భారత్​ ఆ రోజు ఉగ్రదాడిని ఎదుర్కొని అనేకమంది అమాయక పౌరుల ప్రాణాలను కోల్పోయిందని ప్రధాని నరేంద్రమోడీ వారందరికీ నివాళులర్పించారు. మన్​కీ బాత్​ కార్యక్రమంలో ప్రధాని మోడీ ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉగ్రదాడిని ఎదుర్కొని అనేకమంది సైనికులు, పోలీసులు తమ ధైర్య సాహసాలను చూపారన్నారు. దురదృష్టవశాత్తు అందులో కొందరు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

భారత్​ ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించబోదని దాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించివేస్తామన్నారు. దేశం ఈ దాడిని ఎన్నటికీ మరిచిపోలేదన్నారు. అలాగే నవంబర్​ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ( 2015 లో బాబాసాహెబ్​ అంబేద్కర్​ 125వ జయంతి సందర్భంగా) ప్రభుత్వం నిర్వహించాలని నిర్ణయించిందని దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  కాగా, లోక్ సభ, రాజ్యసభలో నారీశక్తివందన్​ చట్టం ఆమోదించామని సంతోషం వ్యక్తం చేశారు. యూపీఐ చెల్లింపులు శుభపరిణామంటూ వ్యాఖ్యానించారు. దేశంలోని యువశక్తి ద్వారా మేధోసంపత్తితో అనేక నూతన ఆవిష్కరణలు చోటు చేసుకోవడం సంతోషకరమన్నారు. అదే విధంగా భారత సంస్కృతిని విస్తరింప చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం రేవ్​ దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.