ప్రీతం జోన ఫౌండేషన్ ఆధ్వర్యంలో  నిర్వహించిన

ప్రీతం జోన ఫౌండేషన్ ఆధ్వర్యంలో  నిర్వహించిన

ఉచిత కుట్టు శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల పంపిణీ

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవల్లిక ప్రకాష్ ల కుమారుడు ప్రీతం జోనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు రకా ల సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. యువకులకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించడం కరోనా కష్టకాలంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేయడం చేపట్టారు. ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ నేర్పించి వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేసే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశారు. 

అందుకు సంబంధించి శనివారం ఉచిత కుట్టు శిక్షణ పొందిన మహిళలకు గండూరి ప్రవల్లిక ప్రకాష్ దంపతులు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.ప్రీతమ్ జోనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషణ్ శిక్షణా శిభిరంలో పూర్తిగా శిక్షణ పొందిన 21వ, వార్డు మహిళలకు, ప్రీతమ్ జోనా ఫౌండేషన్ చైర్మన్, బీ ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు  గండూరి ప్రకాష్  సమక్షంలో గౌరవ కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్  గండూరి ప్రవళిక ప్రకాష్  చేతుల మీదిగా సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 21వ వార్డు మహిళా నాయకురాలు ఢిల్లీపావని, ఉపేందర్, ట్రైనర్ సంతు, జోన ఫౌండేషన్ సభ్యులు చక్ర హరి నాగరాజు, మోత్కూరి సందీప్, గుడిసె శేఖర్, రామ్మూర్తి సందీప్, శిక్షణ పొందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు.