అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసింది

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసింది
  • శ్రీధర్ బాబుకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
  • మంథని డివిజన్ మీడియా కన్వీనర్  ఇనుముల సతీష్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మంథని అసెంబ్లీ నియో జకవర్గం లో అత్యధిక మెజార్టీ సాధించి ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన శ్రీధర్ బాబు కు మంథని నియో జకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మంథని డివిజన్ మీడియా కన్వీనర్  ఇనుముల సతీష్ శుభకాంక్షలు తెలి యజేశారు.

ఈ సందర్భంగా మంగళవారం మంథని లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మంథని డివిజన్ మీడియా కన్వీనర్ ఇనుముల సతీష్  మాట్లాడుతూ...మంథని నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవ హరించిందని ఆరోపించారు. ఓటు అనేది ప్రజా స్వామ్యంలో పౌరుల హక్కన్నారు.పౌరులు ఓటు హక్కును సక్రమంగా విని యోగిం చుకునేందుకు వీలు లేకుండా అధికార యంత్రాంగం అనేక లోటుపాట్లతో వ్యవహరించిందని అన్నారు.ప్రధానంగా 1000 నుంచి 1500 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్ లలో  కనీస సౌకర్యాలు అయిన త్రాగునీటి ఏర్పాటు, దివ్యాంగులకు ర్యాంప్ నిర్మాణం, ట్రై సైకిల్ లాంటివి ఏర్పాటు చేయలేదని అయన విమర్శించారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ బూత్ కు వచ్చిన ఓటర్లు అసౌకర్యాల మధ్య అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకుండానే అధికార యంత్రాంగం దుర్వి నియోగపరిచిందని ఇనుముల ఆరోపించారు.అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓట్లు వస్తున్నాయి అనే ఉద్దేశంతో ఎన్నికలకు  రెండు రోజుల ముందే పోలింగ్ బూత్ లలో భద్రత ఏర్పాట్లు చేయకుండా ఒకే ఒక్క పోలీసును నియమించి నిర్లక్ష్యం చాటుకున్నారని అన్నారు.పదేళ్లపాటు అధికారానికి అరాచకానికి వత్తాసు పలికిన అధికారులు కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే ఇక్కడినుండి వెళ్లిపోవడం మంచిదని ఇనుముల సూచించారు.ప్రభుత్వ శాఖలైన పోలీస్, పంచాయతీరాజ్ శాఖ, రెవెన్యూ, ఆర్ అండ్ బి, ఇరిగేషన్,మున్సిపాలిటీ, తదితర శాఖల కొందరు అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలికిన అక్రమా అధికారుల అవినీతి బయట పెట్టకముందే గౌరవంగా వెళ్ళిపోతే మంచిదని లేనిపక్షంలో మీ అవినీతి, అక్రమాలను ప్రజల ముందు ప్రభుత్వం ముందు ఉంచడం జరుగుతుందని అన్నారు.

శ్రీధర్ బాబు గెలుపుకు కృషిచేసి ఓటు వేసి అత్యధిక మెజారిటీని అందించిన బీసీ లకు, బహుజనులకు పుట్టపాక మాజీ సర్పంచ్ ఆయిలి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.ఓట్ల లెక్కింపులో  పోటీలో ఉన్న అభ్యర్థులు ఏజెంట్లకు సౌకర్యాలు కల్పించడంలో ఎన్నికల అధికారి సిబ్బంది నిర్లక్ష్యం వహించారు.పెద్దపల్లి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్ల నాగరాజు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులకు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఎవరికీ ఎంత మెజార్టీ వచ్చిందో తెలియజేయడంలో అధికారుల వైఫల్యం కనిపించిందని అన్నారు. పెద్దపల్లి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్ల నాగరాజు అన్నారు. అధికారులు మెజారిటీని తక్కువ చేసి చూపించడంలో అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలికారు అని అన్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచి చట్టసభలో అడుగుపెడుతున్న గెలిచిన అభ్యర్థుల మెజారిటీని తక్కువ చేసి చూపడం చెల్లిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుదిల్ల శ్రీధర్ బాబుకు 31, 717 ఓటు రాగా తగ్గించి చూపడం అవివేకం అన్నారు.ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని నాగరాజు డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఇనుముల సతీష్ తో పాటు ఆర్ల నాగరాజు, ఐలి శ్రీనివాస్ పటేల్, గొల్లపల్లి శ్రీనివాస్, ఆరేల్లి  కిరణ్ గౌడ్, జనగామ సడవలి,ఉదరి శంకర్,ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.