మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలి

మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలి
  • జెడ్పి సభలో పలు తీర్మానాలు

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలని మెదక్ జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో సభ్యులు తీర్మానించారు. శనివారం చైర్ పర్సన్  హేమలత శేఖర్ గౌడ్  అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా  ఎమ్మెల్సీలు శేరి సుభాష్  రెడ్డి, యాదవ రెడ్డిలు హాజరయ్యారు.

ఈ సందర్బంగా మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎస్డిఎఫ్ ద్వారా మంజూరైన నిధులను రద్దు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని ఏకగ్రీవం గా తీర్మానించారు. ఎన్డిఎస్ఎల్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించాలని సభలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వికలాంగులందరికీ  కూడ ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని , ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం  చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ రమేష్, జెడ్పీ సీఈఓ వెంకట శైలేష్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు జిల్లా అధికారులు పాల్గొన్నారు.