వనపర్తి గల్లీలలో హోరెత్తుతున్న మేఘారెడ్డి ఇంటింటి ప్రచారం

వనపర్తి గల్లీలలో హోరెత్తుతున్న మేఘారెడ్డి ఇంటింటి ప్రచారం
  • మార్నింగ్ వాక్  లో ఎంపీ ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన
  • డప్పు వాయిద్యాలు, మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలుకుతున్న మహిళలు, నాయకులు

ముద్ర.వనపర్తి:- నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లురవి ని గెలిపించాలని కోరుతూ గత 11 రోజులుగా వనపర్తి పట్టణంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేపట్టిన మార్నింగ్ వాక్ ఇంటింటి ప్రచారానికి  అనూహ్యస్పందన లభిస్తుంది.సోమవారం పట్టణంలోని  1, 2.వార్డు నడింగేరిలో నడింగేరి, కమాన్ చౌరస్తా  లో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం చేపట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీ అభ్యర్థి మల్లురవి ని గెలిపించాలని అభ్యర్థించారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ప్రముఖ  వైద్యుడు పగిడాల శ్రీనివాస్ రెడ్డి,అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.