టీఎస్‌ ఆర్టీసీలో కొత్త పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

టీఎస్‌ ఆర్టీసీలో కొత్త పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

హైదరాబాద్‌టీఎస్‌ ఆర్టీసీ లాజిస్టిక్స్‌ లో ఏఎంటూ పీఎం  పేరుతో ఎక్స్‌ ప్రెస్‌ పార్సిల్‌  కొత్త సర్వీసులు ప్రారంభం అయ్యాయి.

సంస్థ ఎండి వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ టీఎస్‌ ఆర్టీసీ 2020 జూన్‌ లో లాజిస్టిక్స్‌ ప్రారంభించుకున్నాం. లాజిస్టిక్స్‌ ని బాగా ఆదరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ , కర్ణాటక  మహారాష్ట్ర లో కూడా లాజిస్టిక్స్‌ ఉపయోగిస్తున్నారు. 192 వాహవాలు లాజిస్టిక్‌ కి వాడుతున్నాం. పార్సిల్‌ లు రెగ్యులర్‌ బస్సుల్లోనే పంపిస్తున్నాం.

కార్గో కి ఈ వాహనాలు వాడుతున్నాం. 350 మంది ఏజెంట్లు ఉన్నారు. 120 మంది సిబ్బంది ఉన్నారు. 100 శాతం అంగన్‌ వాడి సెంటర్లకి ఆర్టీసీ కార్గో ల ద్వారా నే వెళ్తున్నాయి. స్కూల్‌ బుక్స్‌ ,మెడిసిన్స్‌ , గ్రాసరిస్‌ లాంటివి రవాణ చేస్తామని అన్నారు.