రూట్ ఖరారు! సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రూట్ ఫైనల్ | Mudra News

రూట్ ఖరారు! సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రూట్ ఫైనల్ | Mudra News

ముద్ర, తెలంగాణ బ్యూరో: వందేభారత్ కు దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇప్పటికే ప్రారంభమైన వందేభారత్ పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. అధిక టికెట్ ధరల పైన విమర్శలున్నా.. సౌకర్యాలు -, సమయం ఆదా విషయంలో ప్రయాణీకులు వందేభారత్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సికింద్రాబాద్ _- విశాఖ మధ్య వందేభారత్ నడుస్తోంది. త్వరలో మరో మూడు వందేభారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా సికింద్రాబాద్ _- తిరుపతి వందేభారత్ కొద్ది రోజుల్లోనే పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించి రూట్ ను అధికారులు ఖరారు చేసారు.  దక్షిణ మధ్య రైల్వే పరిధిలో త్వరలో మూడు వందేభారత్ రైళ్ల కు గ్రీన్ సిగ్నల్ లభించింది. సికింద్రాబాద్ _- తిరుపతి, కాచిగూడ-_ బెంగుళూరు, సికింద్రాబాద్ _- పూణే మధ్య ఈ మూడు కొత్త వందేభారత్ రైళ్లను నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్ _- తిరుపతి రైలుకు సంబంధించి ట్రయిల్ రన్ పూర్తి చేసారు. ఈ రూటు లో తిరుపతికి పలు రైళ్లు నడుస్తున్నాయి. అయినా డిమాండ్ తగ్గటం లేదు. నిత్యం వెయిటింట్ లిస్టు భారీగా ఉంటుంది. దీంతో.. ఏ రూట్ లో వందేభారత్ నడపాలనే దానిపైన అధికారులు కసరత్తు చేసారు. సుదీర్ఘ కసరత్తు.. ఎక్కవ మందికి ప్రయోజనం కలిగేలా నడపాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా తాజాగా సికింద్రాబాద్ _- తిరుపతి మధ్య వందేభారత్ రైలు నడిపే రూట్ ను అధికారులు ఖరారు చేశారు.