పద్మశాలి ఆత్మగౌరవ సభకు బయలుదేరిన  లోకేశ్వరం పద్మశాలి సంఘ సభ్యులు

పద్మశాలి ఆత్మగౌరవ సభకు బయలుదేరిన  లోకేశ్వరం పద్మశాలి సంఘ సభ్యులు

లోకేశ్వర ముద్ర:లోకేశ్వరం మండలంలోని పద్మశాలిలు పద్మశాలి ఆత్మగౌరవ సభకు రాజకీయ పార్టీలకు అతీతంగా చలో కోరుట్ల సభకు లోకేశ్వరం మండల పద్మశాలి సంఘ సభ్యులు బయలుదేరారు ఈ సందర్భంగా పద్మశాలి సోదరులు మాట్లాడుతూ  ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో  పద్మశాలీల ఆత్మగౌరవం బీసీలలో అత్యధిక జనాభా కలిగిన పద్మశాలీలకు  గుర్తింపు గౌరవం సమన్యాయం  కావాలి నిర్ణయాలు తీసుకునే దగ్గర మరియు శాసనాలు తయారు చేసే సభలలో లేనందున దీనిని చేదించేందుకు పద్మశాలీల రాజాధికార సాధన కోసం కోరుట్లకు బయలుదేరడం జరిగిందని అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో అత్యధికంగా విస్తరించిన పద్మశాలీలను సంఘటితం చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీలకు ప్రత్యేక ఆస్తిత్వం ఉందని అనాదిగా వస్తున్న  వస్త్రోత్పతి రంగంలో పద్మశాలీల సృజనాత్మకు  జాతీయ అంతర్జాతీయ గుర్తింపు లభించిందని  అలాగే సాహిత్య రంగంలో పద్మశారీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని  రాజకీయ రంగంలో శూన్యత కనిపిస్తుందని  అసెంబ్లీలో ముగ్గురు స్థానాలు కల్పించాలని కోరుట్లలో సభ కు బయలుదేరడం జరిగిందని ఈ సందర్భంగా పద్మశాలి సంఘ సోదరులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సవీన్, నవీన్,నగేష్,భూషణ్, గంగాధర్, లింబాద్రి,నారాయణ తదితరులు పాల్గొన్నారు.