100 పడకల హాస్పిటల్ ను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం

100 పడకల హాస్పిటల్ ను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం
  • మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ ను సందర్శించిన మంత్రి జూపల్లి

ముద్ర.కొల్లాపూర్:- కొల్లాపూర్ పట్టణ సమీపంలో ఉన్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణాని మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు.హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చేస్తాననీ మంత్రి  అన్నారు.అదే విధంగా మాత శిశు సంక్షేమ హాస్పిటల్ ను మంత్రి  సందర్శించారు.అక్కడ పేషంట్ లకు అందుతున్న వైద్య సదుపాయాలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.వేసవి లో హాస్పిటల్ కు వచ్చే గర్భిణీ స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ పట్టణ కౌన్సిలర్ లు,మండల ప్రస్తుత,మాజీ ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.