మైనార్టీ బంధు నిరంతర ప్రక్రియ

మైనార్టీ బంధు నిరంతర ప్రక్రియ
  •  రూ.1కోటి 74 లక్షల పంపిణీ
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: నిరుపేద మైనార్టీలను ఆర్థికంగా బలోపేతం చేసి వారిని ఆదుకునేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి వంద శాతం సబ్సిడిపై ఆర్థిక  మద్దతు పథకాన్ని చేపట్టారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ముస్లిం మైనార్టీలకు ఆర్థిక మద్ధతు పథకం కార్యక్రమం ద్వారా జిల్లా పరిధి లోని కరీంనగర్, హుజురాబాద్, చోప్పదండి, మానకొండూర్ నియోజక వర్గాలతో పాటు హుస్నాబాద్ నియోజక వర్గంలలోని 174 మంది లబ్దిదారులకు రూపాయలు 1 కోటి 74 లక్షల విలువ గల చెక్కులను మరియు జిల్లా పరిధి లోని నాలుగు నియోజక వర్గాలలోని 650 మందికి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గంలోని 119, చొప్పదండి 10, మానకొండూర్ 17, హుస్నాబాద్ 4, హుజురాబాద్ 24  మొత్తం 174 మంది లబ్ధిదారులకు ఒక్కోక్కరికి 1లక్షరూపాయల చోప్పన రూపాయలు 1 కోటి 74 లక్షల విలువ గల చెక్కులను, జిల్లా పరిదిలోని కరీంనగర్ నియోజక వర్గంలో 350 మందికి హుజురాబాద్, మానకొండూర్, చోప్పదండి నియోజకవర్గాలకు 100 చోప్పున  మొత్తం 650 మందికి కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ మైనార్టీలకు ఆర్థిక మద్ధతు పథకం నిరంతర ప్రక్రియ అని, ఈ పథకం ద్వారా ప్రతి నెల అర్హులైన లబ్ధిదారులందరికి చెక్కులను అందించడం జరుగుతుందన్నారు.

 తెలంగాణ వస్తే నిత్యం హిందూ ముస్లింల మత ఘర్షణలు, తీవ్రమైన విద్యుత్ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపెట్టె వారన్నారు. రాష్ట్ర ఆవిర్బావంతో పరిస్థితులు అందుకు భిన్నంగా మారి అభివృద్దిలో దేశంలోనే గోప్ప రాష్ట్రంగా తెలంగాణలో విరాజిల్లుతోందని, ఇక్కడ గంగ జమున నదుల్లా హిందూ ముస్లింలు సోదర భావంతో కలిసి మెలసి ఉంటూ, మత ఘర్షణలు గాని, గొడవలు, కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు గాని లేని శాంతియుత వాతావరణం తెలంగాణాలో నెలకొందన్నారు. తెలంగాణలొ శాంతియుత వాతావరణంతొ పాటు అభివృద్ది కూడా వేగవంతంగా జరుగుతుండడంతో అమెజాన్, గుగూల్ వంటి ప్రపంచస్థాయి కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయని తద్వారా ఉద్యోగ, ఉపాది అవకాశాలు పెరిగుతున్నాయన్నారు. గతంలో కరీంనగర్ జిల్లాకు రావాలంటే భయపడేవారని, ఇక్కడ ఉద్యోగ్యానికి బదిలీపై రావడాన్ని పనిష్మెంట్ గా భావించే స్థితులు ఉండేవన్నారు.  కాని ఇప్పుడు పరీస్థితులు పూర్తిగా మారిపోయి అభివృద్దితో పాటు అద్బుతమైన కేబుల్ బ్రిడ్జీ, మానెరు రివర్ ఫ్రంట్, అద్బుతమైన ఐలాండ్ ల నిర్మాణాలతో హైదరబాద్ తరువాత గోప్ప నగరంగా కరీంనగర్ నిలుస్తుందన్నారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు రావడానికి ఆసక్తిని చూపిస్తూరన్నారన్నారు.

తెలంగాణ ఆవిర్బావానికి పూర్వం రాష్ట్రంలో ఎదైన సంస్థను ప్రారంభించాలన్న, సంక్షేమ పథకాలు లబ్దిదారులకు చేర్చాలన్న సవాలక్ష నిబంధనలతో అడ్డుపడేవని, పథకం కావాలంటే బ్యాంకు లింకేజీ తప్పనిసరిగా ఉండేది దీంతో అర్హులైన వారికి పథకం అందక డబ్బులన్ని వెనక్కి పోయే రోజులుండేవి, కాని  స్వయం పాలనలో బ్యాంక్ లింకేజీ తో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తున్నామని, సంస్థల ఏర్పాటు కావల్సిన అనుమతులను సులభతరం చేయడం జరిగిందని అన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు అనేక కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంతి ప్రవేశపెట్టారని, నిరుపేద మైనార్టీలను ఆదుకునెందుకు మైనార్టీలకు సీఎం కేసీఆర్ ఆర్థిక మద్ధతు పథకాన్ని తీసుకువచ్చారని, బీసీ లకు చేయూత కార్యక్రమంలా మైనార్టీలకు ఆర్థిక మద్దత్తు పథకాన్ని నిరంతర ప్రక్రియగా ప్రతినెల అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు.

పథకం కోసం దళారులను ఆశ్రయించవద్దని, ఎవరైనా ఈ పథకం కోసం లంచం ఇచ్చినట్టు, తీసుకున్నట్లు తెలిస్తే కలెక్టర్ల ద్వారా వారి నుండి తిరిగి చెక్కులను వాపస్ తీసుకుంటామని, లంచం ఇచ్చిన వారిపై, తీసుకున్న వారిపై ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ డబ్బును సద్వినియోగం చేసుకొని అర్థికంగా అభివృద్దిని సాదించాలన్నారు.  హిందూ ముస్లింలు కలిసిమెలిసి జీవిద్దాం, నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ మెంబర్ షూకూర్, హజ్ కమిటీ మెంబర్ ఇర్ఫాన్, సూడా డైరెక్టర్ యూసుఫ్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.