కిసాన్ నిధి విడుదల ఫైల్ పై మోడీ తొలి సంతకం..

కిసాన్ నిధి విడుదల ఫైల్ పై మోడీ తొలి సంతకం..

ముద్ర,సెంట్రల్ డెస్క్:-నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మూడోసారి ప్రధాని పదవిగా ప్రమాణం చేశాక సోమవారం ఉదయం పార్లమెంట్‌ సౌత్‌బ్లాక్‌లోకి ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయ‌న కిసాన్ నిధి విడుద‌ల ఫైల్ పై మోదీ తొలి సంత‌కం చేశారు.. అనంత‌రం ఆయ‌న పిఎంవో సిబ్బందితో కాసేపు ముచ్చ‌టించారు.. పదవీ బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా మోడీ తొలి ఫైల్‌పై సంతకం చేసిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. అందువల్ల తొలి సంతకం రైతుల సంక్షేమానికి సంబంధించినదై ఉండడం సముచితమని భావించామని నరేంద్ర మోడీ తెలిపారు. ఇక, పీఎం కిసాన్ నిధి పథకం వల్ల 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.