సంక్రాంతికి  ‘నా సామిరంగ’ 

సంక్రాంతికి  ‘నా సామిరంగ’ 


కింగ్ నాగార్జున అక్కినేని పుట్టినరోజు సందర్భంగా అభిమానులను ఆనందపరిచే విధంగా ఆయన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పలు ప్రముఖ చిత్రాలకు పనిచేసిన పాపులర్  కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని మాస్ జాతరగా రూపొందుతున్న ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రిచ్  ప్రొడక్షన్ డిజైన్, అత్యుత్తమ టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందనున్న ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరో బిగ్ సర్ ప్రైజ్ గా మేకర్స్ ఒక గ్లింప్స్, ఫస్ట్-లుక్ పోస్టర్ ద్వారా సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘నా సామిరంగ’ అనే క్యాచీ  టైటిల్‌ని ఖరారు చేశారు. టైటిల్ వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఏఎన్ఆర్ కల్ట్ హిట్ ‘సిపాయి చిన్నయ్య’ లోని నా సామి రంగ అనే ఐకానిక్ సాంగ్. నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బీడీ తాగుతూ మాసీ హెయిర్ స్టయిల్, గడ్డంతో మాస్ అవతార్‌ లో కనిపించారు.  టైటిల్ గ్లింప్స్  ‘నా సామి రంగ’ వరల్డ్ ని మనకు పరిచయం చేస్తుంది. పలాస ఫేమ్ కరుణ కుమార్ & అతని గూండాల బ్యాచ్ హీరోని చంపడానికి చూస్తున్నప్పుడు..  సింబాలిక్‌గా కింగ్‌గా పరిచయం అవుతారు. ఇక నాగార్జున ఎంట్రీతో అసలు మాస్ జాతర మొదలవుతుంది. అతని పేరు వినగానే ప్రత్యర్థులు వణుకుతున్నప్పుడు అతను వారిపై దాడి చేయడం మొదలుపెడతాడు. నాగార్జున మాస్ లుక్‌, ఎక్స్ టార్డీనరీ  స్క్రీన్ ప్రెజెన్స్ సీక్వెన్స్‌కు బలాన్ని తెచ్చింది.