యూనిక్ లవ్ స్టోరీ... టక్కర్

యూనిక్ లవ్ స్టోరీ... టక్కర్

2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో టక్కర్‌ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సహనిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ...మంచి కంటెంట్, సిద్దార్థ్ గారు మంచి పెరఫార్మర్, ఈ సినిమా సిద్దార్థ్ గారికి మళ్ళీ ఆ స్థాయి  హిట్ అవుతుంది. డైరెక్టర్ గారు ఈ సినిమాను చాలా బాగా తీసారు. ఈ సినిమాతో మళ్ళీ మన పాత సిద్దార్థ్ గారిని చూస్తామన్నారు. దర్శకుడు కార్తిక్ జి క్రిష్ మాట్లాడుతూ.... నేను ఏ కంటెంట్ రాసిన ఈ సినిమా కంటెంట్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అని చాలామంది చెప్పారు.

ఇప్పటివరకు సిద్దార్థ్ ను మీరు ఒక లవర్ బాయ్ గా చూసారన్నారు. హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ....నన్ను చాలామంది అడుగుతుంటారు మీరు కంప్లీట్ కమర్షియల్ సినిమా చెయ్యొచ్చు కదా అని, దానికి సమాధానమే ఈ సినిమా. ఇప్పటివరకు మిమ్మల్ని ఒక లవర్ బాయ్ లా చూసారు. మిమ్మల్ని నేను కంప్లీట్ డిఫరెంట్ చూపించబోతున్నాను అని చెప్పాడు. నేర్చుకుని మరీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేశాను. 35 రోజుల పాటు యాక్షన్ సీన్స్ తీయడం జరిగింది. ఈ సినిమాలో దివ్యాన్ష పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది.